Baby Health Tips: పిల్లలు దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారాా?.. వెంటనే ఇలా చెక్ పెట్టేయండి!

ఋతువులు మారినప్పుడు చిన్న పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడటం చాలా సాధారణం. పిల్లలు జలుబు, దగ్గు కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు.. జ్వరం, తుమ్ములు, నిద్రలేమి, పాలు త్రాగడంలో ఇబ్బంది.. నిరంతర దగ్గు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. నవజాత శిశువులు, పిల్లలలో దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందడంలో కొన్ని ఇంటి నివారణలు సహాయపడతాయి.

వెచ్చని ఆవ నూనెతో మసాజ్ – పిల్లలకు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించడానికి ఆవ నూనెతో మసాజ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవ నూనెలో నిగెల్లా గింజలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చేయండి. పిల్లల వీపు, అరచేతులు, ఛాతీ, పాదాలను మసాజ్ చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

తులసి ఆకులు- తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పిల్లల దగ్గును నయం చేయడంలో చాలా సహాయకంగా ఉంటాయి. పిల్లలకు తేనెతో కలిపిన తులసి సారాన్ని ఇవ్వాలి. కానీ అంతకు ముందు దాని పరిమిత పరిమాణం గురించి తెలుసుకోలి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

జలుబు, దగ్గును నయం చేసే పసుపు – పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని పిల్లలకు పాలలో కలిపి ఇవ్వవచ్చు. ఇది పిల్లలలో దగ్గు, జలుబును నయం చేయడానికి మంచి ఎంపిక. పసుపు కఫం పలుచబడటానికి, తొలగించడానికి సహాయపడుతుంది.

జలుబుచ దగ్గు నుండి ఉపశమనం – వెల్లుల్లి పిల్లలను రక్షించడమే కాకుండా జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లి పాలు ఇస్తారు.. కాబట్టి తల్లులు తమ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవచ్చు.

విటమిన్ సి – విటమిన్ సి అధికంగా ఉండే రసం దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి మీరు పిల్లల ఆహారంలో విటమిన్ సి ని ఖచ్చితంగా చేర్చాలి.

తరవాత కథనం