healthy care tips: వంటింటి వస్తువులతో షుగర్ వ్యాధికి చెక్.. ఇలా చేస్తే చాలు!

మధుమేహం సమస్య ప్రస్తుతం ఎక్కువైపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని కంట్రోల్ చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ కొందరిలో తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే మీరు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతుంటే వంటింట్లో ఉండే వస్తువులతో కంట్రోల్ చేయవచ్చు.

వీటికి మెడిసిన్స్ వాడడం ఎంత ముఖ్యమో.. ఆహారం, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో వంటింట్లో ఉన్న దాల్చిన చెక్క, అల్లం, పసుపు, వెల్లుల్లి, మెంతి సహా మరెన్నో వస్తువులు సహాయపడతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ పనితీరు మెరుగుపరచడం.. మధుమేహం వల్ల ఇతర వ్యాధుల ను నియంత్రించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.

ఇన్సులిన్ మెరుగ్గా పనిచేయడానికి

శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత అందులోని చక్కెరను కణాల్లోకి పంపిస్తుంది. అయితే మధుమేహం ఉన్న వారిలో ఈ ఇన్సులిన్ హార్మోన్ పెద్దగా పనిచేయదు. అలాంటప్పుడు దాల్చిన చెక్క, అల్లం, మెంతి, పసుపు వంటి వస్తువులను తరచుగా తీసుకోవాలి. దీని ఫలితంగా ఇన్సులిన్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి

కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు తిన్న తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. దాల్చిన చెక్క, అల్లం, మెంతి, పసుపు వంటి వస్తువులు దీనికి బాగా ఉపయోగపడతాయి

కొవ్వును కంట్రోల్ చేయడానికి

దాల్చిన చెక్క, మెంతి వంటి వస్తువులు కొవ్వును కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వు తగ్గితే ఆటోమేటిక్గా డయాబెటిస్ ప్రమాదాలు కూడా కంట్రోల్ అవుతాయి.

తరవాత కథనం