బరువు తగ్గడం చాలా మందికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా సన్నగా కనిపించాలని, కొవ్వు త్వరగా తగ్గాలని కోరుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంచెం కూడా మార్పు రాక చాలా బాధపడతారు. ఎక్కువగా జిమ్‌లకు వెళ్లి బాగా శ్రమిస్తారు. అయితే వ్యాయామం ముఖ్యమే.. కానీ దానికంటే ముఖ్యం ప్రతిరోజూ తినే దానిపై శ్రద్ధ పెట్టడం. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతున్నారు. అందవుల్ల బరువు తగ్గడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలా మంచింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్‌తో గింజలు:
బరువు తగ్గాలనుకుంటే రోజు ఓట్స్, గింజలను కలిపి తీసుకోవాలి. ఇది మంచి ఎంపిక. ఈ కాంబినేషన్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల పదే పదే ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. అతిగా తినకుండా చేస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.
పెరుగు, బెర్రీలు
బరువు తగ్గేటప్పుడు అతిపెద్ద సవాలు.. కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చూసుకోవడం. అలాంటి పరిస్థితిలో.. పెరుగు, బెర్రీల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో జీవక్రియను వేగవంతం చేసే ప్రోటీన్ ఉంటుంది. బెర్రీలలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇవి కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.
నట్ బటర్, ఆపిల్స్
యాపిల్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని వేరుశెనగ లేదా బాదం వెన్నతో కలిపి తింటే.. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ కూడా లభిస్తాయి. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో పదే పదే ఆకలిగా అనిపించకుండా చేస్తుంది.
అవకాడో, ఆకు కూరలు:
బరువు తగ్గాలనుకుంటే అవకాడో, పాలకూర వంటి ఆకు కూరలను కలిపి తినడం మంచి మార్గం. పాలకూరలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అవసరమైన పోషకాలు శరీరానికి సరిగ్గా చేరుకోవడానికి సహాయపడుతుంది.