Piles: పైల్స్ ఉన్నవారు ఇవి తింటే డేంజర్!

Piles: ప్రస్తుత బిజీ లైఫ్ లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అటువంటి సమస్యల్లో పైల్స్ ఒకటి. చాలామంది ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. పైల్స్ తో బాధపడుతున్న వ్యక్తి మలవిసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి, రక్తస్రావాన్ని అనుభవిస్తాడు. ఆహారంలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడం, నీళ్లు సరిగ్గా తాగకపోవడం, సరైన జీవశైలి లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్నిఆహారాలను మాత్రమే అస్సలు తినకూడదు. ఇవి సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

కారం, మసాలాలు

కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి . అలాగే పచ్చళ్లు, చింతపండు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం మానేయాలి. ఇవి మలబద్ధకానికి కారణమై పైల్స్ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

ఫైబర్

ఆహారంలో సరైన ఫైబర్ కంటెంట్ తీసుకోకపోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. మలబద్ధకం పెరిగితే, అది పైల్స్‌కు దారితీస్తుంది. కావున ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. బిస్కెట్లు, వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి వాటిని తినకూడదు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన మాంసం, ప్యాక్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అలాగే మసాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి మలబద్దకం, పైల్స్ కి దారితీస్తుంది.

పాలు, పాల ఉత్పత్తులు

పైల్స్‌ సమస్య ఉన్నవారు పాలు, జున్ను వంటి వాటిని కూడా తినకూడదు. వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది, అవి మలబద్ధకాన్ని పెంచుతాయి.

జంక్ ఫుడ్

వేపుడు పదార్థాలు, చిప్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బర్గర్లు వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది పైల్స్ సమస్యకు కారణమవుతుంది. అలాగే చక్కెర, చాక్లెట్లు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు వంటివి కూడా పూర్తిగా మానేయాలి. ఇవి ప్రేగులలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి.

వీటితో పాటు కెఫీన్, మద్యం వంటివి కూడా తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఇవి డీహైడ్రేషన్ సమస్యకు కారణమై మలబద్ధకాన్ని పెంచుతాయి. పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి నీరు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం