Money Saving Ideas: ఈ చిన్న చిట్కాలతో.. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా! ఒక్కసారి ట్రై చేయండి

Money Saving Ideas: సంపాదనతో పాటు, సంపాదించిన డబ్బును సేవ్ చేయడం కూడా చాల ముఖ్యం. ఎంత ఖర్చు చేస్తున్నారు, దేని కోసం ఖర్చు చేస్తున్నారు, ఎంత సేవింగ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. దీనినే బడ్జెట్ ప్లానింగ్ అంటారు. ఇది లేకపోతే మనం ఎంత కష్టపడినా బూడిదలో పూసిన పన్నీరే! ఈరోజు మనం చేసే చిన్న చిన్న సేవింగ్స్ రేపు పెద్ద మొత్తంగా మారి.. అత్యవసర పరిస్థితుల్లో ఆడుకుంటాయి. డబ్బును ఎలా సేవ్ చేయాలి అనే దానికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..

ప్లానింగ్

ఇల్లు అద్దె, కరెంట్ బిల్లు, నిత్యావసర వస్తువులు, పిల్లల ఫీజులు – ఇలా అన్ని ఖర్చులను ఒక పుస్తకంలో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు ఏమిటో మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.

పొదుపు

ముందుగా మీకు ‘పొదుపు’ అనేది ఒక అలవాటుగా మారాలి. ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే, అందులో కొంత భాగాన్ని పక్కన పెట్టాలి. ఉదాహరణకు, జీతంలో 10% లేదా 15% వెంటనే పొదుపు ఖాతాలో వేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆ డబ్బును ఖర్చు చేయకుండా ఉంటారు.

 చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకోవడం

పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం మాత్రమే కాదు, చిన్న చిన్న ఖర్చులు కూడా చాలా ముఖ్యం. రోజూ బయట టీ తాగడం, కాఫీలు కొనడం, ఆన్‌లైన్‌లో అనవసరమైన వస్తువులను ఆర్డర్ చేయడం – ఇలాంటి ఖర్చులన్నీ కలిపితే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కావున ఈ చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది.

తెలివిగా షాపింగ్ చేయడం

షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ముందుగానే ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్టులో ఉన్నవి మాత్రమే కొనడానికి ప్రయత్నించండి. ఆన్‌లైన్ ఆఫర్లు చూసి అనవసరమైన వస్తువులు కొనకండి. అలాగే, కొన్ని సూపర్ మార్కెట్లలో వస్తువులు బల్క్‌గా కొంటే ధర తగ్గుతుంది. అలాంటి ఆఫర్లను ఉపయోగించుకోండి.

పెట్టుబడులు

డబ్బును కేవలం బ్యాంకులో ఉంచడం మాత్రమే కాకుండా, పెట్టుబడులు పెట్టడం వల్ల మీ డబ్బు పెరుగుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా మీకు తెలిసిన వాటిలో చిన్నగా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి. అయితే వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్లాలి.

డబ్బు ఆదా చేయడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఓపిక, క్రమశిక్షణ చాలా అవసరం. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. మీ కలలు సాకారం అవుతాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం