Life Style: వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రకృతి అంతా పచ్చగా, ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఈ అందమైన వాతావరణంతో పాటు, దోమల బెడద కూడా పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో దోమలు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. కొన్ని సార్లు ఇవి ప్రాంతకం కూడా కావచ్చు. ఈ వ్యాధులు రాకుండా దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే, కొన్ని సులువైన ఇంటి చిట్కాలను పాటించడం చాలా అవసరం! మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దోమల నివారణకు సులువైన ఇంటి చిట్కాలు
నీరు నిల్వ లేకుండా
ఇంట్లో, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దీనివల్ల ఆ మురికి నీటిలో నీరు వచ్చి చేరుతాయి. ఉదాహరణకు పాత కుండీలు, టైర్లు, డబ్బాలు, పగిలిన కుండలు వంటి వాటిలో నీరు చేరితే దోమలు పెరుగుతాయి. కావున వాటిని వెంటనే తొలగించండి.
నెట్స్ వేయండి
మీ ఇంటి కిటికీలు, తలుపులకు దోమల నెట్స్ అమర్చుకోండి. దీని వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే పడుకునేటప్పుడు దోమ తెరలు వాడటం చాలా మంచిది. దీంతో పాటు దోమల స్ప్రేలు, కాయిల్స్ లేదా లిక్విడ్స్ వాడవచ్చు. కానీ వీటిని వాడేటప్పుడు పిల్లలకు దూరంగా ఉంచండి.
ఇంట్లో శుభ్రత
మీ ఇంట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే శుభ్రం చేయండి. అలాగే చెత్త డబ్బాలు మూసి ఉంచండి. చెత్తను రోజూ బయట పడేయండి. దీంతో పాటు ఇంటి చుట్టూ ఉండే పొదలు, గడ్డిని తరచుగా కత్తిరించండి.
కొబ్బరి నూనె + కర్పూరం
కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఇంట్లో దోమలు వచ్చే చోట పెట్టండి. దీని వాసన దోమలను దూరం చేస్తుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని ఇంటి చుట్టూ స్ప్రే చేయండి. దీని వాసన దోమలకు నచ్చదు.
వేపాకు పొగ
సాయంత్రం వేళల్లో ఇంట్లో వేపాకు పొగ వేయండి. వేప పొగ దోమలను దూరం చేస్తుంది.






