అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. దీనికోసం రకరకాల ప్రొడెక్టులు వాడేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కొన్ని సార్లు కెమికల్ ప్రొడెక్టులు వికటించి ముఖం అంద విఖారంగా తయారవుతుంది. ప్రస్తుత వేసవి సీజన్ సూర్యకాంతి, వేడి ఇతర సమస్యలు ముఖం మెరుపును తొలగిస్తాయి. దానిని తిరిగి పొందడం కష్టమవుతుంది. కానీ ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన పెరుగు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంపై సహజమైన మెరుపు అవసరం. సహజమైన మెరుపు ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల నుండి దొరకదు.. పెరుగు వంటి సహజ వస్తువుల నుండి వస్తుంది. ముఖంపై పెరుగును అప్లై చేయడం ద్వారా ముఖ సౌందర్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందాం.
చర్మానికి ఎలా మేలు జరుగుతుంది?
ఫ్రిజ్లో ఉంచిన పెరుగు మీకు చాలా స్పెషల్. ఇది చాలా ప్రయోజనకంగా ఉంటుంది. దీనిని సరైన రీతిలో ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాన్ని అందుకోగలరు. అయితే సాధారణ పెరుగును కూడా అప్లై చేయవచ్చు.. కానీ ఫ్రిజ్లో ఉంచిన చల్లని పెరుగు ముఖానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది అనేక ప్రయోజనాలను ఇస్తుంది.
ప్రయోజనాలు
రిఫ్రిజిరేటర్లో ఉంచిన చల్లని పెరుగును రోజుకు రెండు మూడు సార్లు ముఖంపై పూసుకుంటే, ముఖ చర్మం వేడి నుండి ఉపశమనం పొందుతుంది. అదే సమయంలో ఇది అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందులో మొదటిది ముఖ చర్మం మెరుపు. అందమైన ముఖం కోసం ఫ్రిజ్ లో ఉంచిన పెరుగును ముఖానికి అప్లై చెయ్యాలి.
సరైన మార్గం
ముఖానికి అప్లై చేసే ముందు పెరుగును కనీసం 20 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచాలి. ఆపై బయటకు తీసి ముఖానికి అప్లై చేయాలి. ముఖాన్ని కడుక్కోకుండా ముఖంపై అప్లై చేసి, ఆపై చేతులతో మసాజ్ చేస్తూ ఉండాలి. కనీసం 10 నిమిషాల పాటు వేళ్లతో ముఖంలోని అన్ని భాగాలను మసాజ్ చేస్తూ ఉండాలి.
ఎంతసేపు పెరుగు రాయాలి?
ముఖాన్ని కనీసం 10 నిమిషాలు పెరుగుతో మసాజ్ చేసిన తర్వాత, వెంటనే దానిని కడిగేయాలి. ఆ తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాలు చర్మంపై ఉంచాలి. దానిని అస్సలు ముట్టుకోకూడదు. దీని తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి, కాటన్ బట్టలతో తుడవాలి.
చిట్కా: పెరుగు ఉపయోగించిన తర్వాత, కనీసం 2 గంటల పాటు ఏ ఫేస్ వాష్ లేదా మరే ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తిని ఉపయోగించవద్దు.