Benefits of Papaya: రుచిగా ఉండాలి.. ఆరోగ్యాన్ని అందించాలి అంటే.. అన్ని సీజన్ లో దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. చాలా మంది ఇష్టంంగా తినే ఈ బొప్పాయి. మెక్సికో నుంచి సుమారు నాలుగేళ్ల క్రితం మన దేశానికి వచ్చింది. వస్తూ.. వస్తూ ఆరోగ్యాన్ని వెంట తెచ్చింది.. మరి బొప్పాయిలో ఏమేమి పోషకాలు ఉన్నాయో.. అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానకి కూడా చాలా మంచిది. అసలు దీనిలో ఉన్నన్ని విటమిన్లు మరి ఏ పండ్లు లేవంటే.. అతి శయోక్తి కాదు. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్లు, పీచు పపదార్ధాలు, పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్లేవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బొప్పాయి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా కావాల్సిన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. బొప్పాయి పండులో తక్కువ కాలరీస్ ఉంటాయి.
బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్స్, ఆంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి.. అధిక కొవ్వు పదార్ధాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుండి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. బొప్పాయిలో పొపైన్, కైమో పొపైన్ అనే రెండు రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి రెండు ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. తద్వారా శరీరంలోని అంతర్గత వాపులను తగ్గిస్తాయి. స్వల్ప జీర్ణ సమస్యల నివారణకు వాడే ఔషదాలలో అనుబంధ పదార్ధంగా పపాయను ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక వ్యాదులైన ఆర్ధరైటిస్, ఆస్తమా వంటి వ్యాధులకు బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. మన శరీరం బాక్టీరియా, వైరస్ లతో పోరాడాలంటే.. బలమైన రోగనిరోధక శక్తి అవసరం.
బొప్పయి పండు మీ చెంత ఉంటే.. మీ ఇమ్యూనిటీకి బోలడంత పవర్ వచ్చినట్లే. బొప్పాయిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కారకాల నుండి పోరాడతాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా అద్బుతంగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కొన్ని రకాల పదార్ధాలు కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా అందంగా ఉండేలా సహాయపడుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు, ట్యాన్ ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది.