Rainy Season Saftey: వర్షాకాలంలో సురక్షితంగా ఇంటికి చేరడానికి ఈ 5 టిప్స్!

Rainy Season Saftey: గత వారం రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రోడ్లన్నీ కాలువలుగా దర్శనమిస్తున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే ఈ సమయంలో రోడ్లపై ప్రయాణించడం సవాలుగా మారుతుంది. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండటం, నీరు నిలవటం, రాత్రి పూట సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున , వర్షాకాలంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

స్లో డ్రైవింగ్

వర్షం పడుతున్నప్పుడు రోడ్డు తడిగా ఉంటుంది. దీనివల్ల వాహనం టైర్లు రోడ్డు మీద పట్టు కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల, సాధారణ వేగం కంటే నెమ్మదిగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల బ్రేక్ వేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది, ప్రమాదాలను నివారించవచ్చు.

వాహనం హెడ్ లైట్లు

వర్షం ఎక్కువగా పడినప్పుడు, ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డు సరిగా కనిపించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ వాహనం హెడ్ లైట్లు ఆన్ చేసుకోవాలి. ఇది మీతో పాటు ఇతరులకు కూడా మీ వాహనం కనపడేలా చేస్తుంది, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

వేకిల్ కండీషన్

వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందు, మీ వాహనాన్ని ఒకసారి పూర్తిగా పరీక్షించుకోండి. ఏవైనా పార్ట్స్ పాడైతే వెంటనే సరి చేయించండి. టైర్లు బాగా ఉంటేనే తడి రోడ్డుపై పట్టు ఉంటుంది. కావున టైర్లు అరిగిపోకుండా చూసుకోవాలి.

బ్రేకులు, వైపర్‌లు 

అలాగే బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ వాహనం వైపర్‌లు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి గాజు మీద ఉండే నీటిని తొలగించి, రోడ్డును స్పష్టంగా చూడటానికి సహాయపడతాయి.

దూరం పాటించండి

వర్షంలో మీ ముందు వెళ్లే వాహనానికి, మీ వాహనానికి మధ్య సరైన దూరం పాటించాలి. బ్రేక్ వేసినప్పుడు తడి రోడ్డుపై వాహనం వెంటనే ఆగదు. కాబట్టి, ముందస్తు వాహనానికి దూరం పాటించడం వల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చినా సురక్షితంగా ఉండవచ్చు.

డ్రైనేజ్ గుంతలు

వర్షాకాలంలో రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై నీటిలో కనిపించని గుంతలు ఉండవచ్చు. అందువల్ల, చెప్పులు జారకుండా చూసుకోవడం, జాగ్రత్తగా నడవడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాకాలంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించవచ్చు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం