అందం ఒక్క స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా ముఖ్యమే. కానీ తమ చర్మ సౌందర్య సంరక్షణపై కేవలం మహిలలు మాత్రమే కేర్ తీసుకుంటారు. పురుషుల్లో చాలా తక్కువ మంది మాత్రమే తమ చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే పురుషుల చర్మం తాజాగా, యవ్వనంగా ఉండటానికి చాలా జాగ్రత్త అవసరం. ఎండ, ధూళి, కాలుష్యం ఎవరి చర్మంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికి రెగ్యులర్ క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. అయితే మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం?
నిపుణులు ఏమంటున్నారు
చర్మ సంరక్షణ అనేది మహిళలకు మాత్రమే కాదు. పురుషులతో సహా అందరికీ అవసరం. అనేక కారణాల వల్ల పురుషుల చర్మం కూడా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. కొన్నిసార్లు వారు వారి వయస్సు కంటే పెద్దవారిలా కనిపించడం జరుగుతుంది. దీని కోసం పురుషులు ఉదయం, రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ఉదయం ఏం చేయాలి?
1. మొదటిగా నూనె, మురికిని తొలగించడానికి స్కిన్‌ను డీప్ క్లీన్ చేయాలి. దీని కోసం ఇంట్లో ఉండే తాజా కలబంద, దోసకాయ, పెరుగు, తేనెను ఉపయోగించవచ్చు.
2. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
3. ఎండ వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని చర్మంపై రాసుకోవాలి.
రాత్రి ఏం చేయాలి?
1. రాత్రి విషయానికొస్తే.. మురికిని, కాలుష్యాన్ని తొలగించడానికి డబుల్ క్లెన్సింగ్‌ను తీసుకోవాలి. అదే సమయంలో ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి ఆయిల్-బేస్డ్ క్లెన్సర్‌ని ఉపయోగించాలి.
2. చర్మం పోషణ, పునరుద్ధరించడానికి రాత్రిపూట సీరం లేదా మాయిశ్చరైజర్ స్కిన్‌పై అప్లై చేయాలి.
ఇవి గుర్తుంచుకోండి
చాలా మంది పురుషులు జిడ్డుతో లేదా మొటిమలకు గురయ్యే స్కిన్ కలిగి ఉంటారు. కాబట్టి సరైన ప్రొడెక్ట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో చర్మ నిపుణుడి సలహా తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చర్మానికి అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు మాత్రమే ఫేస్‌పై జిడ్డు, మొటిమలు మటుమాయం అవుతాయి.






