సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరానికి ఎక్కువ జాగ్రత్త, పోషకాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే అత్యంత సాధారణ సమస్యలలో ఆర్థరైటిస్ నొప్పి ఒకటి. దీని నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ఈ సమస్య ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు కీళ్ల నొప్పి ఒకటి. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల ఇవి తలెత్తుతాయి. కొన్ని పోషకమైన ఫుడ్స్ తినడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పిని నయం చేయవచ్చు.
నట్స్
వేరుశెనగ, బాదం లేదా వాల్‌నట్స్ వంటి గింజలను తినాలి. వాటిలో పుష్కలంగా ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కీళ్లను ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి.
చట్నీ
కొబ్బరి, వెల్లుల్లి, అవిసె గింజలు లేదా కొత్తిమీర వంటి చట్నీలలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిస్తుంది. మోకాళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మజ్జిగ
జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆమ్లతను తగ్గించడంలో, మంటను తగ్గించడంలో, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటన్నింటితో పాటు ప్రతిరోజూ 15 నిమిషాలు శారీరక వ్యాయామం చేయడం, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం.
అలాగే కొవ్వు చేపలు (సాల్మన్, సార్డిన్లు), ఆకు కూరలు, గింజలు, పసుపు వంటి ఆహారాలను ఎక్కువగా తినడం మంచిది. వాటిలో కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడే సహజ శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.






