Urban Hobosexuality: అద్దె భారంతో రిలేషన్ షిప్.. నగరాల్లో పెరుతున్న “హోబోసెక్సువాలిటీ” ట్రెండ్!

Urban Hobosexuality: ఈ రోజుల్లో నగరాల్లో ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక సింగిల్ బెడ్ రూమ్ అద్దె 20,000 పైగా ఉంటుంది హైదరాబాద్ లో. మనకొచ్చే చాలీ చాలని జీతాలతో ఈ రెంట్లను కట్టుకోవడం పెద్ద యుద్ధమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒక కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అదే ”అర్బన్ హోబోసెక్సువాలిటీ”! అసలు పెరిగిన అద్దెలకు.. ఈ ట్రెండ్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకోండి.

హోబోసెక్సువాలిటీ అంటే ఏమిటి?

హోబోసెక్సువాలిటీ అంటే, ఆర్థిక భారం తగ్గించుకోవడానికి లేదా నివాసం కోసం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ.. వారితో సంబంధం పెట్టుకోవడం. ఈ పదం వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా, ఇది మన సమాజంలో ప్రస్తుతం పెరుగుతున్న ట్రెండ్. వీళ్ళు బయటకు చాలా ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం వారి స్వార్థం దాగి ఉంటుంది.

ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది?

అధిక అద్దెలు: ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. చాలామంది యువత తమ జీతంలో 40 శాతం కంటే ఎక్కువ అద్దెకే ఖర్చు చేస్తున్నారు. కావున ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం దీనిని ఒక మార్గంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే నగరాల్లో ఒంటరిగా నివసించడం వల్ల కలిగే భావోద్వేగాలు దీనికి ఒక కారణం.
డెలాయిట్ నివేదిక ప్రకారం, 2025లో 50 శాతానికి పైగా యువత ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నారు.

ఈ ట్రెండ్ గురించి సైకోథెరపిస్ట్ డాక్టర్ చాంద్నీ తుగ్నాయత్ అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి సంబంధాలు పైకి ప్రేమగా కనిపించినప్పటికీ, వాటిలో దాగి ఉన్న అసమానత (power imbalance) చాలా ప్రమాదకరం. ఇలాంటి సంబంధాలు నిస్వార్థమైన ప్రేమతో ఏర్పడడం లేదు. ఒక భాగస్వామి ఇంకొక భాగస్వామి ఫైనాన్షియల్ , ఎమోషనల్ సపోర్ట్ ని పూర్తిగా వాడుకోవడం ద్వారా ఏర్పడుతున్నాయి. ఈ సంబంధాలు కేవలం కంపానియన్‌షిప్ (companionship) అనే ఒక భ్రమ కోసం మాత్రమే కొనసాగుతున్నాయని ఆమె హెచ్చరించారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం