Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బావ కో పైలట్ మృతి

2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవడంతో తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.

కాగా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సన్నిహితుడు కూడా మరణించాడు. ఈ విషాద సంఘటనపై బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారు కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్. విమానం కమాండ్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ వద్ద ఉండగా.. కోపైలట్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు. వీరిలో నటుడు విక్రాంత్ మాస్సే స్నేహితుడు క్లైవ్ కుందర్ ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇదే విషయాన్ని నటుడు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

బాధలో విక్రాంత్

విక్రాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ అత్యంత విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ప్రియమైనవారి కోసం నా హృదయం విరిగిపోయింది.

ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, తన మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్‌ను కోల్పోయాడు. అతను ఆ దురదృష్టకర విమానంలో అధికారిగా విధుల్లో ఉన్నాడు. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించుగాక.. ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా ప్రభావితమైన వారందరికీ బలాన్ని ప్రసాదించుగాక అని తన పోస్టులో రాసుకొచ్చారు.

విక్రాంత్ మాస్సే పోస్ట్ ఆయన అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. సినీ ప్రముఖుల కుటుంబాలు కూడా ఈ విషాదంలో భాగమయ్యాయి. ఈ సమయంలో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని వైపుల నుండి సంతాపం, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆయన తన భార్య, కుమార్తెను కలవడానికి లండన్ వెళ్తున్నారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో, సల్మాన్ ఖాన్, విష్ణు మంచు, రాణా దగ్గుబాటి ప్రస్తుతానికి తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

ఏం జరిగిందంటే?

ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి లండన్ కు టేకాఫ్ అవుతున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం