కేంద్ర ప్రభుత్వం బుధవారం పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ముందు తెలిపారు. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
” సమాజంలోని విలువలు, ప్రయోజనాలకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది” అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంతా మంచే చేసిందని.. ఏ వర్గంలోనూ ఒత్తిడి లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాబోయే జనాభా లెక్కల్లో కులగలను చేర్చాలని నిర్ణయించిందని తెలిపారు. కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి భాగస్వాములు కులగననను ప్రతిసారి రాజకీయ సాధనగా ఉపయోగించుకుంటున్నాయని ఆయన అన్నారు. గత యూపీఏ ప్రభుత్వాలు కులగననను నిర్వహించడంలో చాలా విఫలమయ్యాయని ఆరోపించారు.
కానీ సర్వేలు మాత్రం నిర్వహించాయని తెలిపారు. ఈ కులగనన దాదాపు 1947 నుంచి జరగలేదన్నారు. 2010లో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్ సభకు కులగనన అంశాన్ని మంత్రివర్గంలో పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. దానికోసం ఒక బృందం ఏర్పడిందని.. అనేక పార్టీలు దీనిని సిఫార్స్ చేశాయని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన కాకుండా కుల సర్వే నిర్వహించిందని తెలిపారు.