Nara Lokesh: మాష్టారు మీరే మా’స్టార్‌’ – గురువుల గౌరవాన్ని పెంచుతున్న లోకేష్‌- ట్రెండ్‌సెటర్ అంటున్న టీడీపీ శ్రేణులు

Nara Lokesh

Nara Lokesh: గూగుల్, ఏఐలు ఎంత పవర్‌ ఫుల్ అయినప్పటికీ గురువుకు ఉన్న ఔన్నత్యమే వేరు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా అందుకు పునాది బలంగా ఉండాలి. అలాంటి పునాది వేసేదే గురువు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి రాష్ట్రపతి అయినా సరే ఇద్దరికి తలవంచక తప్పదు. అందులో ఒకరు పేరెంట్స్ అయితే మరొకరు గురువు. దేవుడైనా సరే గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సింది.కానీ కార్పొరేట్‌ స్టైల్‌ చదువులు వచ్చేసరికి గురువుకు చిన్నబోతున్నాడు. గురువుపై సమాజానికి గౌరవం తగ్గుతోంది. పెరుగుతున్న సాంకేతిక విప్లవం నేటి తరం కళ్లకు గంతలు కడుతున్నాయి. అందుకే ఉపాధ్యాయుడు జెన్‌జీలకు ఆనడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాలానికి అనుగుణంగా మారుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరుడిగా తీర్చిదిద్దేందుకు తపించే ఉపాధ్యాయులు ప్రతి ఊరిలో ఉన్నారు. కానీ ప్రభుత్వ విధానాలు వారి పనిని వారు చేసుకోనివ్వడం లేదు. పాఠాలు చెప్పారా అని అడగాల్సిన అధికారులు, ప్రభుత్వాలు విద్యతో సంబంధం లేని పనులు గురించి పదే పదే ప్రశ్నిస్తున్నాయి. శిక్షలు వేస్తున్నాయి. అందుకే చాలా మంది మనకెందుకులే అన్న ధోరణితో పాఠాలు కంటే పాఠ్యేతర పనులపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇది ఒక విధంగా విద్యార్థులను మోసం చేసినవాళ్లం అవుతున్నట్టు లెక్క.

వీటికి తోటు ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉండే జీతభత్యాల విషయంలో కూడా ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఆకలి వేసినప్పుడు పెట్టే అన్నం కంటే ఆకలి చచ్చిపోయిన తర్వాత పెట్టే బిర్యానీకి విలువ ఉండదు. అలానే ఉపాధ్యాయులకు సకాలంలో రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదు. ఇది కూడా ఉపాధ్యాయులను వెనక్కి లాగుతున్నాయ.

ఇలాంటి క్లిష్టతర పరిస్థితుల్లో కూడా వచ్చే కొద్ది మంది పిల్లలకు శ్రద్ధగా పాఠాలు చెప్పి వారి జీవీతాల్లో వెలుగులు నింపే ఉపాధ్యాయులు అక్కడక్కడ తారసపడుతున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. వీలు చిక్కినప్పుడు వారిని పిలిచి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలే జీవితంగా బతుకుతున్న ఎందరో గురువులకు ఇది నిజంగానే ప్రోత్సాహకరంగా ఉంటోంది. కష్టపడి పని చేసే వ్యక్తులు కోరుకునేది కాస్త గుర్తింపు అలాంటి గుర్తింపు లోకేష్ అందివ్వడంపై ఉపాధ్యాయుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో అలాంటి ఇద్దరి ఉపాధ్యాయుల గురించి తెలుసుకున్న నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వారి కృషిని అభినందింతారు. అలాంటి వారిలో కాకినాడ జిల్లాకు చెందిన అనిశెట్టి సీతారామరాజు. ఆయన పని చేసే గొల్లప్రోలు శివారుసూరంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేదు. దీంతో తన సొంత నిధులు వెచ్చించి ఆయన బడికి రోడ్డు వేశారు. దీన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నారా లోకేష్‌ సీతారామరాజును అభినందించారు. మీరు సూపర్ సార్ అంటూ కితాబు ఇచ్చారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కూడా నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లి పిలించి ‘షైనింగ్ టీచర్’పేరుతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని వివరించారు. కల్యాణి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్టు చెప్పారు.

Image

Image

ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోందన్నారు నారా లోకేష్‌ రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతామని అన్నారు. తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారని అభినందించారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్ కి అభినందనలు తెలియజేశారు. మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దామని పిలుపునిచ్చారు. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దామని ఆకాంక్షించారు.

ఈ మధ్య అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్‌ను కాదని మోడల్ ప్రైమరీపాఠశాలలో చేరారు. దీన్ని కూడా నారా లోకేష్ తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. అందుకు అక్కడి ఉపాధ్యాయులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందన్నారు. విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాదికాలంగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకేరోజు 32మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని కితాబు ఇచ్చారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, తలిదండ్రులకు మనస్పూర్తిగా అభినందించారు.

ఉపాధ్యాయులను అభినందిచడమే కాదు ఎక్కడ విద్యార్థులకు సమస్యలు ఉన్నావెంటనే స్పందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు విఆర్ స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్‌ను ప్రాధేయపడ్డారు. బిక్షాటన చేస్తూ తమ స్కూల్ తెరిపించాలని వేడుకున్నారు. దీన్న ిచూసిన లోకేష్‌ ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించారు. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక్క సాధనం విద్య అని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న కసి, పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

అన్నట్టుగానే అధికారులతో మాట్లాడి నెల్లూరు నగరంలో వీఆర్(వెంకటగిరి రాజా వారి) మున్సిపల్ కార్పోరేష్ హైస్కూల్ ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న వీఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. ఈ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి నారాయణ చొరవ తీసుకుని రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. పీ-4 స్ఫూర్తితో డీఎస్ ఆర్ గ్రూప్స్ నిధులతో మూలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల, వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్ ఎస్ ఆర్ మున్సిపల్ హైస్కూల్ లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు.

వీఆర్ స్కూల్ ప్రారంభించిన అనంతరం ముందుగా పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని గత శనివారం కమిషనర్ ను అభ్యర్థించిన ఇద్దరు చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి.వెంకటేశ్వర్లకు అడ్మిషన్లు కల్పించి అండగా నిలిచారు. ఆయన చేతుల మీదుగా అడ్మిషన్ ఫాంలు ఏవో వెంకటరమణకి అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఇలా ఓవైపు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూనే పేదలకు విద్యాబుద్దులు నేర్పేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులను కూడా అభినందిస్తున్నారు. ఓ విద్యాశాఖ మంత్రి ఇలాంటివి చేయడం ఇప్పుడు ఇదో ట్రెండ్‌ సెటర్లా మారుతుందని అంటున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం