ntr vidya sankalpam scheme.. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఏపీలోని కూటమి సర్కార్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువుకు భరోసానిచ్చేందుకు మరొక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ కొత్త పథకానికి ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ అనే పేరు పెట్టింది. దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించనుంది.

ఇందులో భాగంగానే కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా వీటిని ఇస్తారు. కాగా ప్రస్తుతం డ్వాక్రా సభ్యులకు స్తీనిధి ద్వారా 11 శాతం వడ్డీతో రుణాలిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కేవలం 4 శాతం వడ్డికే ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకం ద్వారా రుణాల్ని ఇవ్వనున్నారు.

ముఖ్య వివరాలు

ఈ స్కీమ్‌కు అధికారులు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ అనే పేరు పెట్టారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి అందించారు. కేజీ నుంచి పీజీ వరకు అందరి విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనున్నారు.

ఎవరు అర్హులు?

ఈ పథకానికి అర్హులు ఎవరు? అనేది కూడా అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో చదివే స్టూడెంట్స్‌కు ఈ స్కీమ్ వర్తింప చేయనున్నారు.

త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డ్వాక్రా మహిళలు స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణాన్ని.. పిల్లల చదువుకే ఉపయోగించాలి.

ఫీజు, పుస్తకాలు, యూనిఫాంతో సహా ఇతర కొనుగోలుకు వాడుకోవచ్చు.

తీసుకున్న రుణాన్ని ఏ పని కోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి.

ఈ రుణాన్ని వాయిదాల రూపంలో కట్టాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం