Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం (మే 7) తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ దాడిలో ఇప్పటి వరకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు పాక్ ఆర్మీ దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు. భారతదేశం తన దాడిలో ఆపరేషన్ సింధూర్ పేరుతో.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రత్యేకంగా పేర్కొంది.

మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమ చర్యలు కేంద్రీకృతమై కొలవబడ్డాయి.. అంతేకాని అవి తీవ్రతరం కావు. పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదు అని ఆ ప్రకటనలో అధికారులు తెలిపారు.

గత నెలలో పహల్గామ్‌లో హిందూ పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా భారతదేశం చేపట్టిన సైనిక చర్యకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారు. సిందూర్ అనేది వివాహిత హిందూ మహిళలు నుదిటిపై ధరించే సాంప్రదాయ ఎర్రటి సింధూరం యొక్క హిందీ పదం. ఇది రక్షణ, వైవాహిక నిబద్ధతను సూచిస్తుంది.

గత నెలలో పహల్గామ్‌లో పర్యాటకులైన హిందూ పురుషులను వారి భార్యల ముందే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దారుణమైన దాడిలో మొత్తం 26 మంది మరణించారు. భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై దాడులతో తగిన సమాధానం ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

తరవాత కథనం