simhachalam temple accident: సింహాచలం ఆలయ ప్రమాదంలో 8మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ప్రకటించిన సీఎం

ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో భారీ ప్రమాదం జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఈ మేరకు మృతదేహాలను విశాఖ కే జి హెచ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవడం పై వారితో చర్చించారు.

అనంతరం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న చికిత్స సాయం వివరాలు జిల్లా అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మెరుగని వైద్య అందించాలని సూచించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులు కమిటీతో విచారణకు ఆదేశించారు.

గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అదే సమయంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా బాదిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాసం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.

తరవాత కథనం