Canadian Open Title: వారెవ్వా… గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ని ఓడించి.. 18 ఏళ్ల విక్టోరియా సంచలనం!

Victoria Mboko

Canadian Open Title: కెనడియన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా ఎంబోకో 18 ఏళ్ల వయసులో కెనడియన్ ఓపెన్ టైటిల్‌ 2025 విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది.

18 ఏళ్ల వయసులో

ఫైనల్‌లో నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచిన నవోమి ఒసాకాను 2-6, 6-4, 6-1 తేడాతో ఓడించింది. ఇది ఎంబోకోకు మొదటి WTA 1000 టైటిల్. ఈ టోర్నమెంట్‌లో ఆమె సోఫియా కెనిన్, కోకో గాఫ్, ఎలెనా రైబకినా, ఒసాకా వంటి నలుగురు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌లను ఓడించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. 18 ఏళ్ల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించిన రెండో అతి చిన్న వయస్కురాలుగా విక్టోరియా నిలిచింది. ఈ రికార్డులో సెరెనా విలియమ్స్ మొదటి స్థానంలో ఉంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో ర్యాంక్ పట్టికలో 300 స్థానంలో ఉన్న ఎంబోకో, ఈ టోర్నమెంట్‌లో వైల్డ్‌కార్డ్‌గా ప్రవేశించి 85వ ర్యాంకుకు చేరుకుంది. ఇప్పుడు ఆమె ప్రపంచ ర్యాంకింగ్‌లో 25వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

ఎంబోకో అత్యంత తక్కువ ర్యాంక్ నుంచి WTA 1000 ఈవెంట్‌ను గెలిచిన క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే, ఓపెన్ ఎరాలో ఈ ట్రోఫీని గెలిచిన మూడవ కెనడియన్ క్రీడాకారిణి కూడా విక్టోరియనే.

ఇదిలా ఉంటే.. ఎంబోకో తల్లిదండ్రులు 2006లో ఉత్తర కరోలినాలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి వలస వచ్చారు. చిన్న వయసు నుంచే టెన్నిన్స్ ఆడడం ప్రారంభించిన ఎంబాకో ఆటపై మక్కువ పెంచుకుంది. 2025లో ఐదు ఐటీఎఫ్ టైటిళ్లను గెలుచుకున్న కెనడియన్ మహిళల రికార్డును నెలకొల్పింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం