AUS vs SA: ఆదివారం డార్విన్‌లోని మర్రారా క్రికెట్ గ్రౌండ్‌లో.. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక దశలో ఆస్ట్రేలియా జట్టు 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్, జట్టును ఆదుకోవడమే కాకుండా, ఒక కొత్త రికార్డును కూడా సృష్టించాడు.
రికార్డుల మోత
డేవిడ్ 52 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాపై ఒక T20I మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆస్ట్రేలియన్ ఆటగాడిగా డేవిడ్ రికార్డును నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆరుగురు ఆటగాళ్ల పేరిట ఉండేది.
మిచెల్ మార్ష్ (2023లో 79 పరుగులు 6 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (2023లో 91 పరుగులు 6 సిక్సర్లు) డేవిడ్ వార్నర్ (2009లో 89 పరుగులు 6 సిక్సర్లు), డేవిడ్ హస్సీ (2009లో 88 పరుగులు 6 సిక్సర్లు) ఈ రికార్డును పంచుకున్నారు. కానీ ఇప్పుడు డేవిడ్ 8 సిక్సర్లతో వారిని అధిగమించాడు.
జట్టును ఆదుకున్న డేవిడ్
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, డేవిడ్.. బెంన్ డ్వార్షుయిస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 59 పరుగులతో కీలక భాగస్వామ్యం కనబరిచారు. వారిద్దరి అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 పరుగుల స్కోరు సాధించగలిగింది. డ్వార్షుయిస్ 19 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
గత నెల రికార్డు
ఇది మాత్రమే కాదు గత నెలలోనే డేవిడ్ మరొక రికార్డును కూడా సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 37 బంతుల్లోనే 102 పరుగులు చేసి, ఆస్ట్రేలియా నుంచి వేగవంతమైన T20I సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 11 సిక్సర్లు బాది జట్టుకు విజయం ఇచ్చాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.






