Chris Gayle – Virat Kohli: విరాట్ పేవల ఫామ్‌పై క్రిస్ గేల్ షాకింగ్ వ్యాఖ్యలు.. ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ!

Chris Gayle

ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేవలఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ సింగల్ డిజిట్ నెంబర్ కి అవుట్ అయిపోతున్నాడు. అతడు హాఫ్ సెంచరీ చేసి చాలా నెలలు అయింది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా పెద్దగా రాణించలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో కూడా పెద్దగా ఆడలేక పోతున్నాడు.

ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. మోకాలు కి గాయం కారణంగా మొదటి మ్యాచ్ ఆడ లేకపోయాడు. ఇక ఆ తర్వాత మ్యాచ్ కి ఎంట్రీ ఇచ్చాడు. రెండో వన్డే మ్యాచ్లో దిగాడు. ఈ మ్యాచ్లో కేవలం ఎనిమిది బంతుల్లో ఐదు పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో విరాట్ అభిమానులు నిరాశ చెందారు. త్వరలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.

మరి ఈ మ్యాచ్ లో ఏమైనా మిరాకిల్ చేస్తాడేమో చూడాలి. విరాట్ కోహ్లీ పేవల ఫామ్ పై వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ఇప్పటికే ప్రపంచ అత్యుత్తమ బ్యాటరే అని కొనియాడాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ ఎలా ఉన్నా అతడు ఇప్పటికీ అత్యుత్తమ ఆటగాడే అని అన్నాడు. ఒక్కసారి వివిధ ఫార్మేట్ లలో అతడు ఎన్ని సెంచరీలు చేశాడో గుర్తు చేసుకోండి.

క్రికెటర్లుగా మందరం ఏదో ఒక సమయంలో పేవల ఫామ్ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు. కోహ్లీ ప్రస్తుతం కెరిర్ చరమాంకంలో ఉన్నాడని తనకు తెలుసు అన్నాడు. అందువల్ల తనలో తాను ప్రారంభించుకొని పుంజుకునే ప్రయత్నం చేయాలని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం