Cristiano Ronaldo: రొనాల్డో-జార్జినా నిశ్చితార్థం: ఇంటర్నెట్‌ను షేక్ చేసిన పోస్ట్!

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జార్జినా తన వేలికి ఒక భారీ ఉంగరం ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, దాని కింద స్పానిష్ భాషలో “Yes I do. In this and in all my lives.” (అవును, నేను అంగీకరిస్తున్నాను. ఈ జన్మలో, అన్ని జన్మలలోనూ) అని రాశారు. ఈ పోస్ట్ తో అభిమానుల్లో వీరి నిశ్చితార్థం గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి.

నిశ్చితార్థం..?

అయితే, ఇప్పటివరకు రొనాల్డో లేదా జార్జినా ఈ నిశ్చితార్థాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. గత ఏప్రిల్‌లో కూడా జార్జినా ఇలాంటి ఒక ఉంగరం ఫోటోను షేర్ చేసినప్పుడూ ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ, అప్పుడు రొనాల్డో మాత్రం మౌనంగా ఉన్నారు. 2017లో FIFA అవార్డుల వేడుకలో రొనాల్డో, జార్జినా మొదటిసారి కలిసి బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత వారి బంధం అధికారికంగా మారింది.

పెళ్ళికి ముందే వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రొనాల్డో మొదటి కుమారుడు క్రిస్టియానో జూనియర్ (15) అతని ముందు రిలేషన్ షిప్ ద్వారా పుట్టాడు. ఆ తరువాత, సరోగసీ ద్వారా ఈవా , మాటియో (8), కవలలు జన్మించారు . జార్జినాతో అలానా (7) బెల్లా (3) పిల్లలు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. జార్జినా జీవితంపై “ఐ యామ్ జార్జినా” (I Am Georgina) అనే డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యింది. ఇందులో ఆమె జీవితం, రొనాల్డోతో ఆమె సంబంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం