SRH Vs CSK: చెపాక్‌లో చెన్నైను పడగొట్టిన హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య 43వ మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాగింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. చెన్నైని సొంత గడ్డపై ఓడించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్స్ అదరగొట్టేసారు. ముఖ్యంగా కమీందు ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు. ఓవైపు బౌలింగ్ లోను మరోవైపు ఫీల్డింగ్ లోను ఇంకోవైపు బ్యాటింగ్ లోను అదరగొట్టేసాడు. మిగతా ప్లేయర్లు తోడవడంతో ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించింది.

ముందుగా టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన సిఎస్కే మొదటి నుంచి తడబడింది. ఓపెనర్ గా వచ్చిన షేక్ రషీద్ మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత స్కోర్ పర్వాలేదనిపించింది. 4.2 ఓవర్లకు 1 వికెట్ నష్టపోయి 39 పరుగులు వచ్చాయి. అప్పటికి స్కోర్ మెరుగ్గానే ఉన్న వరుస వికెట్లు కోల్పోవడంతో చెన్నై జట్టు కుప్పకూలిపోయింది. ఒక్కరు కూడా పెద్ద షాట్లు ఆడలేకపోయారు.

ఇలా మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో చెన్నై జుట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 19.5 ఓవర్లకే 154 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. బ్రేవిస్ 25 బంతుల్లో 42 పరుగులు చేశాడు, ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు. మిగతా వారంతా చేతులెత్తేయడంతో సీఎస్కే ఇంత తక్కువ స్కోర్ చేయగలిగింది. శ్యామ్ కరణ్ 9 పరుగులు, రవీంద్ర జడేజా 21 పరుగులు, ధోని 6 పరుగులు, దీపక్ హుడా 22 పరుగులు చేశారు.

155 పరుగుల టార్గెట్ తో చేజింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అందుకుంది. మొదటినుంచి ఒత్తిడి లేకుండా ఆడిన srh జట్టు మెల్లిమెల్లిగా పరుగులు రాబట్టింది. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. (0) పరుగులకే అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా పెద్దగా ఫామ్ కనబరచలేదు. 19 పరుగులకే వెనుతిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మెల్లిమెల్లిగా ఆడుతూ రన్స్ సాధించాడు. కానీ ఒక్కొక్కరుగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. ఒకానొక సమయంలో సన్రైజర్స్ జట్టు ఓడిపోతుంది అని అంతా భావించారు. క్లాసేన్ 7 పరుగులకు వెనుతిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అనికేత్ పర్వాలేదనిపించారు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ కాస్త ఉపశమనాన్ని అందించారు.

అదే సమయంలో మరో బారిషాట్ కొట్టే ప్రయత్నంలో కిసాన్ అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 44 పరుగులు రాబట్టాడు. మరికొద్ది సేపటికి అనికేత్ వర్మ వికెట్ కోల్పోయాడు. 19 పరుగులు చేసే అవుట్ అయ్యాడు. అయితే అప్పటికి పెద్ద స్కోర్ తేడా లేకపోవడంతో కమెందు, నితీష్ కుమార్ భాగస్వామ్యంతో విజయం సొంతమైంది.

తరవాత కథనం