ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 56వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై దూకుడుకు గుజరాత్ చెక్ పెట్టింది. తీవ్ర ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది.
వరుసగా ఆరు విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన ముంబై ఇండియన్స్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ పెద్ద జలక్ ఇచ్చింది. మూడు వికెట్ల తేడాతో ముంబాయిని దాని సొంత గడ్డపై ఓడించింది. దీంతో పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆర్సిబి జట్టును వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు పేవలమైన బ్యాటింగ్ చేసింది. ఆరంభంలో తడబడింది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకుని ఓ మోస్తారు స్కోర్ కు పరిమితమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికిల్టన్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో ముంబై జట్టు చేతులెత్తేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది.
అందులో విల్ జాక్స్ 35 బంతుల్లో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ 24 బంతుల్లో 35 పరుగులు చేసాడు. రికిల్ టన్ రెండు పరుగులకే వెనుతిరిగాడు. రోహిత్ శర్మ ఏడుపొరుగులకు అవుట్ అయిపోయాడు.
దీంతో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు అలవోకగా చేదించింది. ఓవైపు వర్షం పడి మ్యాచ్ ఆగింది. మళ్లీ తగ్గడంతో మ్యాచ్ మొదలైంది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజర్చుకున్నట్లు టైటాన్స్ కనిపించింది. 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. కానీ మెల్లిమెల్లిగా పరుగులు రాబట్టి విజయాన్ని అందుకుంది టైటాన్స్.
సాయి సుదర్శన్ ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. శుభమనగిల్ 46 బంతుల్లో 43 పరుగులు చేశాడు. షారుక్ ఖాన్ 6 పరుగులతో వెనుతిరిగాడు. రూథర్ఫర్డ్ 15 బంతుల్లో 28 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 2 పరుగులు సాధించాడు.