GT VS SRH: గిల్‌ జిగేల్‌.. గుజరాత్‌కు ఏడో విజయం.. అభిషేక్‌ మెరుపులు వృథా

ఐపీఎల్ 2025 సీజన్ లో 51 వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితమైన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు ఏడో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. మొదట టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు బ్యాటింగ్కు దిగింది.

ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ చెలరేగిపోయారు. ఇద్దరూ మంచి శుభారంభం అందించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగులు వరద పెట్టించారు. ఇద్దరూ పోటీపడి మరి పరుగులు రాబట్టారు. ఓవైపు సాయి సుదర్శన్, మరోవైపు గిల్ బారిషాట్లతో చెలరేగిపోయారు. ఇక సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన బట్లర్ మరింత విజృంభించాడు.

అయినా గిల్ తన దూకుడు తగ్గించలేదు. ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల కు చెమటలు పట్టించారు. దీంతో నిర్దేశించి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేశారు. శుభమన్ గిల్ 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు, బట్లర్ 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

దీంతో 225 పరుగుల లక్ష్య చేధనకు దిగిన సన్రైజర్స్ జట్టు మొదటినుంచి మంచి ప్రదర్శన చేసింది. కానీ ఓపెనర్ల మీదే డిపెండ్ అయిన ఎస్ఆర్హెచ్‌కు మధ్యలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ హెడ్ అతి తక్కువ సమయానికి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత భారీ షాట్లతో, సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు.

దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఒక్కడే విజృంబించడంతో SRH ఓడిపోయింది. హెడ్ 20 పరుగులు, ఇషాన్ కిషన్ 13 పరుగులు, అనికేత్ 3 పరుగులు, కమీందు 0 పరుగులు, నితీష్ 21 నాట్ అవుట్, కమిన్స్ 19 నాట్ అవుట్ గా మిగిలారు.

తరవాత కథనం