IND Vs ENG: ఇంగ్లాండ్‌కు చెక్ పెట్టిన జడేజా, సుందర్‌.. నాలుగో టెస్టును డ్రా చేసుకున్న భారత్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య డ్రాగా ముగిసింది. ఒకానొక దశలో పరాజయం అంచున నిలిచిన భారత జట్టు, రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్)ల అజేయ శతకాలతో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను కాపాడుకుంది.

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్‌పై 311 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం పరుగులేమి చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103), కేఎల్ రాహుల్ (90) నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు కొంత ఊరటనిచ్చారు.

చివరి రోజు ఆటలో గిల్, రాహుల్ అవుటైన తర్వాత, రిషబ్ పంత్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేకపోవడంతో భారత్‌కు ఓటమి ఖాయమనిపించింది. కానీ, జడేజా, సుందర్ జోడి అనూహ్యంగా క్రీజులో పాతుకుపోయి, ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, కీలక సమయంలో శతకాలు సాధించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. ఇరు జట్లు డ్రాకు అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది. ఈ డ్రాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో, చివరి టెస్ట్ జూలై 31న లండన్‌లోని ఓవల్‌లో ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం