MI VS CSK: సీఎస్కే బౌలర్లను ఉతికారేసిన రోహిత్.. ముంబై ఖాతాలో మరో ఘన విజయం

ఐపీఎల్ 2025 సీజన్ లో రోహిత్ శర్మ పేవలమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే అవుట్ అయిపోతున్నాడు. అతడు ఇక బ్యాటింగ్ చేయలేడు. అతని స్థానంలో మరొకరిని పంపిస్తే బాగుంటుంది. రోహిత్ శర్మ ఓపెనర్ గా కాకుండా మరొక ప్లేసులో బ్యాటింగ్కు దిగాలి. ఇలా ఇప్పటివరకు రోహిత్ పై వినిపిస్తున్న విమర్శలు.

కానీ ఇవేమీ రోహిత్ పట్టించుకోకుండా తనలో ఆత్మ విశ్వాసం నింపుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. వాంకడే స్టేడియం వేదికగా ముంబై వర్సెస్ చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్లో చెన్నై జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక వికెట్ నష్టంతో విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 76 పరుగులు చేసి అదరగొట్టేసాడు.

మొదట టాస్ఓడి చెన్నై జట్టు బ్యాటింగ్కు దిగింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, శివం దుబే హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. జడేజా 35 బంతుల్లో 53 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దూబే 32 పంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇలా మొత్తంగా 176 పరుగులు సాధించారు.

ఈ లక్ష్య చేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయిపోయింది. రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై జట్టు నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తరవాత కథనం