ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మైనర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టగా, ఇప్పుడు జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఈ కొత్త ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జైపూర్‌కు చెందిన యువతి ఫిర్యాదు ప్రకారం.. క్రికెట్‌లో మంచి కెరీర్ చూపిస్తానని యశ్ దయాల్ నమ్మించి, రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. తొలిసారి అత్యాచారం జరిగినప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జైపూర్‌కు వచ్చినప్పుడు యశ్ దయాల్‌ను కలిశానని, క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడదామని సీతాపురలోని ఒక హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది.
గత కేసు:
ఇప్పటికే యశ్ దయాల్‌పై ఘజియాబాద్‌కు చెందిన ఒక యువతి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆయన అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు గతంలో స్టే విధించింది.
రెండు లైంగిక వేధింపుల కేసులతో యశ్ దయాల్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఆరోపణలు నిజమని రుజువైతే ఆయనకు కనీసం పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవైపు ఐపీఎల్‌లో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న యశ్ దయాల్, ఇలాంటి తీవ్ర ఆరోపణల్లో చిక్కుకోవడం అభిమానులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం రెండు కేసులపై విచారణ కొనసాగుతోంది.






