RCB: అదరగొట్టిన ఆర్సీబీ.. 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో ప్రవేశం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) ఫైనల్‌కు చేరుకుంది. గురువారం (మే 29) ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని కేవలం 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆపై కేవలం 10 ఓవర్లలోనే స్వల్ప స్కోరును ఛేదించి IPLలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.

ఫిల్ సాల్ట్ కేవలం 27 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేశాడు. ఇలా 60 బంతులు (10 ఓవర్లు) మిగిలి ఉండగానే ఆర్‌సిబి విజయం సాధించింది. ఐపిఎల్ చరిత్రలో ఐపిఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్‌లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఇది అతిపెద్ద విజయం ఇదే అనే చెప్పాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ గతంలో ఇలాంటిదే ఒక విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది. గత సీజన్ ఫైనల్‌లో కెకెఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై 57 బంతులు మిగిలి ఉండగానే 114 పరుగులను ఛేదించింది.

బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. హేజిల్‌వుడ్‌ (3/21), సుయశ్‌ శర్మ (3/17), యశ్‌ దయాళ్‌ (2/26) ధాటికి పంజాబ్‌ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. స్టాయినిస్‌ (26) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. ఇక ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (56 నాటౌట్‌; 27 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తం మీద ఐపీఎల్ చరిత్రలో ఇది మూడవ అత్యంత వేగవంతమైన 100-ప్లస్ ఛేజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్‌సిబి 18 సంవత్సరాలలో నాల్గవసారి ఫైనల్‌కు చేరుకుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 100+ ఛేజింగ్‌లు

9.4 ఓవర్లు – RCB vs KKR, బెంగళూరు 2015 (లక్ష్యం: 112) – వర్షం కారణంగా ఆట కుదించబడింది.
9.4 ఓవర్లు – SRH vs LSG, హైదరాబాద్, 2024 (లక్ష్యం: 166)
10.0 ఓవర్లు – RCB vs PBKS, ముల్లన్పూర్, 2025 (లక్ష్యం: 102)*
10.1 ఓవర్లు – KKR vs CSK, చెన్నై, 2025 (లక్ష్యం: 104)

ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 3/17 వికెట్లు తీసిన సుయాష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

తరవాత కథనం