ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం చిన్న స్వామి స్టేడియంలో 52వ మ్యాచ్ జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన పోరు సాగింది. ఈ తగ్గ పోరు మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఘనవిజయం సాధించింది. కేవలం రెండు పరుగులు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆర్సిబి జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెతెల్ మంచి ఆరంభం అందించారు. ఇద్దరూ పోటీపడి షాట్లు కట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. స్పీడ్, స్పిన్ బౌలర్లను ఈ ఇద్దరూ ఉతికి ఆరేశారు. పవర్ ప్లే లోనే ఆర్సిబి జట్టు 71 పరుగులు చేసి విజృంభించింది. ఇలా ఆర్సిబి జట్టు 18 ఓవర్లలో 5 క్రికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
కానీ ఆఖరి 2 ఓవర్లలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 19 ఓవర్ లో రోమరీయో షెఫర్డ్ విజృంభించాడు. 6 బాళ్లకు 32 పరుగులు రాబెట్టాడు. నాలుగు సిక్సులు, రెండు ఫోర్లు బాదేసాడు. ఇక చివరి ఓవర్ లోను షెఫర్డ్ రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్ లో రెండు సిక్స్ లు, రెండు ఫోర్ లతో 14 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ సాధించాడు. దీంతో నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సిబి జట్టు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఆర్సిబి బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 62 పరుగులు, జాకబ్ బెతేల్ 55 పరుగులు, షెఫర్డ్ 53* పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పడికల్ 17 పరుగులు, జితేష్ శర్మ 7 పరుగులు, రజిత పాటిదార్ 11 పరుగులు చేశారు.
దీంతో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విజృంభించింది. 16 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ఆర్సిబిని ఓడిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. కేవలం రెండు పరుగులు తేడాతో సీఎస్కే ఓడిపోయింది. ఆయుష్ మాత్రే 94 పరుగులు, రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ తో విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. కానీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమిపాలైంది.