RR Vs Mi: మెరిసిన రికిల్‌టన్, రోహిత్‌..100 పరుగుల తేడాతో రాజస్థాన్‌ చిత్తు

ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి నుంచి పేవలమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. మొదటి ఐదు మ్యాచ్ లలో 4 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండేది. కానీ ఉన్నట్టుండి ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతుంది. ప్రత్యర్థులకు కొంచెం అవకాశమైనా ఇవ్వకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఘనవిజయం సాధించి వరుసగా ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. ఒకవైపు బ్యాటర్లు, మరోవైపు బౌలర్లు చెలరేగిపోవడంతో వరుస విజయాలు అందుకున్నారు. ఇక ముంబై తో మ్యాచ్ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ప్లేస్ నుంచి నిష్క్రమించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అదరగొట్టేసింది. ఓపెనర్లు రికిల్టన్, రోహిత్ శర్మ దుమ్ము దులిపేసారు. ప్రత్యేర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుస పరుగులు రాబట్టారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఎలాంటి బౌలర్నైనా చిత్తుచిత్తు చేశారు. ఈ ఇద్దరి ఓపెనర్ల భాగస్వామ్యంతో ముంబై జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.

వీరికి తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కలవడంతో ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఓపెనర్ రికిల్టన్ 38 బంతుల్లో 61 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇద్దరూ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా దంచి కొట్టారు.

వీరిద్దరూ పరుగులు వరద పెట్టించారు. సూర్య కుమార్ 23 బంతుల్లో 48 పరుగులు రాబట్టి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 48 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

ఇక 218 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతులెత్తేసింది. గత మ్యాచ్లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ సైతం ఈ మ్యాచ్లో తేలిపోయాడు. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ ఎక్కువ సమయం క్రీజ్ లో నిలబడలేకపోయారు. వైభవ్ ఈసారి ఖాతా తెరవకుండానే పెవీలియన్కు చేరాడు. ఆ తర్వాత జైస్వాల్ సైతం చేతులెత్తేశాడు.

అక్కడ నుంచి ఆర్ఆర్ పతనం మొదలైంది. వచ్చిన బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్కు చేరారు. ముంబై బౌలర్లలో బుమ్రా, బోల్ట్, కర్ణ శర్మ చెలరేగిపోయారు. దీంతో ఆర్ఆర్ జట్టు 117 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఆర్ఆర్ జట్టులో ఆర్చర్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో 8 వ ఓటమి చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

తరవాత కథనం