CSK VS PBKS: శ్రేయస్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై ఇంటికి.. పంజాబ్ కింగ్స్ పైపైకి

IPL 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆశలకు తెరపడింది. మొదట్నుంచి దారుణమైన ప్రదర్శన చేస్తూ వచ్చిన ఆ టీం ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఆ జట్టు 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి టీముగా పరాభవాన్ని అందుకుంది.

దాదాపు 10 మ్యాచ్ లలో 8 మ్యాచులు ఓడి ప్లే ఆఫ్స్ కు దూరమైంది. బుధవారం సీఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్లు తేడాతో చెన్నైని దాని సొంత గడ్డపై ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 19.2 ఓవర్లకి 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

చెన్నై బ్యాటర్లలో శ్యాంకరన్ అదరగొట్టేసాడు. 47 బంతుల్లో 88 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. మిగతా వారెవరు పెద్దగా స్కోర్ చేయలేదు. షేక్ రషీద్ 11 పరుగులు, మాత్రే 7 పరుగులు, జడేజా 17 పరుగులు, బ్రేవిస్ 32 పరుగులు, ధోని 11 పరుగులు చేశారు. పంజాబీ కింగ్స్ బౌలర్లలో చాహాల్ 4 వికెట్లు, అర్షదీప్ 2 వికెట్లు, మార్కో 2 వికెట్లు పడగొట్టారు.

దీంతో 191 పరుగుల లక్ష్యంతో దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొట్టేసింది. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ ప్రబ్ సిమ్రాన్ దుమ్ము దులిపేశాడు. మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ తోడవడంతో విజయం సొంతమైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు రాబట్టాడు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం