సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏమైంది?.. ఐపీఎల్ లో బలమైన టీమ్‌గా.. ఆరెంజ్ ఆర్మీగా పేరు సంపాదించుకున్న సన్రైజర్స్ వరుసగా మ్యాచ్లు ఎందుకు ఓడిపోతున్నారు?.. అనే ప్రశ్నలకు నిన్న గట్టి సమాధానం దొరికింది. వరుస అపజయాలను దాటుకొని ఎవరు ఊహించని విధంగా.. ఐపీఎల్ చరిత్రలోనే ఊహకందని విజయాన్ని హైదరాబాద్ జట్టు తన పేరిట లిఖించుకుంది.
నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ చించి చెండాడేసాడు. ఉప్పల్ స్టేడియం లో ఉన్న క్రికెట్ అభిమానులు అభిషేక్ శర్మ బాదుడికి ఫిదా అయిపోయారు. 55 బంతుల్లో 141 పరుగులు చేసి ఎవరి ఊహలకు అందని రికార్డును క్రియేట్ చేశాడు. 14 ఫోర్లు 10 సిక్స్ లతో పరుగులు వరదరాబెట్టాడు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ ఇచ్చింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 82 పరుగులు సాధించి అబ్బురపరిచాడు. వరుసగా బౌండరీలు సిక్సర్లతో చెలరేగిపోయాడు. అలాగే ప్రబ్ సిమ్రాన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో పరుగుల వరద పెట్టించాడు. స్థాయినిస్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మొత్తంగా పంజాబ్ జట్టు 245 పరుగులు చేసింది.
దీంతో చేజింగ్లో 246 పరుగులు టార్గెట్ తో దిగిన హైదరాబాద్ జట్టు వీరబాదుడు బాధింది. సన్రైజర్స్ ఓపెనర్లుగా దిగిన హెడ్, అభిషేక్ శర్మ కొట్టిన కొట్టుడుకి ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్లను చిత్తుచిత్తు చేశారు. బ్యాట్ పట్టుకొని క్రిజ్ లోకి వచ్చిన దగ్గర్నుంచి దూకుడే దూకుడుగా ఆడారు. ఒకరు ఫోర్ కొడితే మరో సిక్స్.. నువ్వు కొడితే నేనేమైనా తక్కువ అన్నట్లు ఇద్దరు చెలరేగిపోయారు.
పవర్ ప్లే లో సున్నా వికెట్ల నష్టానికి 83 పరుగులు రాబట్టింది సన్రైజర్స్ జట్టు. ఇక 10 ఓవర్ లు అయ్యేసరికి సన్రైజర్స్ జట్టు 143 స్కోర్ తో గెలుపు దిశగా దూసుకెళ్లింది. ఇక హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు రాబట్టి అవుట్ అయ్యాడు. అయినా అభిషేక్ శర్మ విధ్వంసం ఆగలేదు. అవతల ఎలాంటి బౌలర్ అయిన ఊగిపోయాడు. కేవలం 40 బాల్స్ లో సెంచరీ పూర్తి చేశాడు.
ఇలా 55 బంతుల్లో 141 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. అప్పటికి ఎస్ ఆర్ హెచ్ జట్టు 15 ఓవర్లలో 200 స్కోర్ దాటింది. ఆ తర్వాత క్రిజ్ లో ఉన్న క్లాస్సేన్ (21*), ఇషాన్ కిషన్ (9*) మ్యాచ్ను ముగించారు. దీంతో సన్రైజర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 246 పరుగుల టార్గెట్ ను చేదించింది.