Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో తల్లిదండ్రులు అయ్యారు. ఆగస్టు 7న రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నాదల్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
“మిక్వెల్” అని పేరు
ఈ చిన్నారికి “మిక్వెల్” అని పేరు పెట్టారు. మరియా తండ్రి జ్ఞాపకార్థం బాబుకు ఈ పేరును పెట్టారు. అయితే మరియా తండ్రి 2023 ఏప్రిల్‌లో చనిపోయారు. ఈ మేరకు ఆయన జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు. ఈ శుభవార్తపై నాదల్ అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ఆటతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నాదల్, ఇప్పుడు తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే .. నాదల్, మరియా దంపతులకు 2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. మొదటి సంతానంగా కూడా వీరికి కొడుకే పుట్టాడు. అతని పేరు రఫెల్ జూనియర్.ప్రస్తుతం ఆ బాబుకు మూడు సంవత్సరాలు. 2005లో నాదల్ చెల్లెలు ద్వారా పరిచయమైన నాదల్, మరియా.. 14 సంవత్సరాలు ప్రేమించుకుని 2019 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు.
నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2024 నవంబర్‌లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. ఇక మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో ఒక బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసి, రఫెల్ నాదల్ ఫౌండేషన్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






