wcl 2025 india vs pakistan: పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్.. టోర్నీ నుంచి తప్పుకున్న భారత్

ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌ టోర్నీ నుంచి భారత్ వైదొలగడంతో, పాకిస్థాన్ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. జూలై 31న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌ రద్దు కావడానికి గల కారణం, ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు నిరాకరించారు.

లీగ్ దశలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవగా, అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అయితే, సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను భారత్ బహిష్కరించడంతో, టోర్నీ నియమాల ప్రకారం పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు వాకోవర్ లభించి, వారు ఫైనల్‌కు అర్హత సాధించారు.

ఈ పరిణామం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని భారత ఆటగాళ్లు తమ నిర్ణయంతో మరోసారి నిరూపించుకున్నారు. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలగడం ఆసియా కప్, 2026 టీ20 ప్రపంచ కప్ వంటి భవిష్యత్ టోర్నమెంట్‌లలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి, ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌ టోర్నీ ఫైనల్‌లో పాకిస్థాన్ తన ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తోంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం