భారతదేశంలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వెల్లడైంది. ఇవాళ (జూన్ 16)న ఐసిసి షెడ్యూల్‌ను ప్రకటించింది. భారతదేశంతో పాటు, శ్రీలంకకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. అయితే పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడనుంది. అందువల్ల పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ భారత్‌లో కాకుండా శ్రీలంకలో జరుగుతాయి.
సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం
2025 మహిళల ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. అక్టోబర్ 5 న ఈ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ సెమీ-ఫైనల్ -1 కి చేరుకుంటే ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ సెమీ-ఫైనల్ ఆడకపోతే ఈ మ్యాచ్ కోసం గువహతి ఆతిథ్యం ఇస్తుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 29, 30 తేదీలలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2 న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ కోసం వేదికను కొలంబో, బెంగళూరులో ఏర్పాటు చేశారు.
మొత్తం 8 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. అందులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి.
The countdown begins ⏳
The full schedule for the ICC Women’s Cricket World Cup 2025 is out 🗓
Full details ➡ https://t.co/lPlTaGmtat pic.twitter.com/JOsl2lQYpy
— ICC (@ICC) June 16, 2025
షెడ్యూల్
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 1: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ఇండోర్
అక్టోబర్ 2: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 3: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – బెంగళూరు
అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – ఇండోర్
అక్టోబర్ 7: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ – గౌహతి
అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 9: భారత్ vs దక్షిణాఫ్రికా – వైజాగ్
అక్టోబర్ 10: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 11: ఇంగ్లాండ్ vs శ్రీలంక – గౌహతి
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – వైజాగ్
అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 14: న్యూజిలాండ్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 15: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 16: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 18: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ – కొలంబో
అక్టోబర్ 21: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – గౌహతి
అక్టోబర్ 24: పాకిస్తాన్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా vs శ్రీలంక – ఇండోర్
అక్టోబర్ 26: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – గౌహతి
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు
అక్టోబర్ 29: సెమీ-ఫైనల్ 1 – గౌహతి/కొలంబో
అక్టోబర్ 30: సెమీ-ఫైనల్ 2 – బెంగళూరు
నవంబర్ 2: ఫైనల్ – కొలంబో/బెంగళూరు






