జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 279కి చేరుకుంది. ఇందులో 241 మంది ప్రయాణీకులు.. మెడికోలు, సమీప ప్రజలు కలిపి 38 మంది మరణించారు. విమానం కూలిపోయిన హాస్టల్‌లోనే చాలా మంది మెడికల్ స్టూడంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో హాస్టల్ బాల్కనీ నుండి విద్యార్థులు దూకుతున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!
Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc
— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025
ప్రమాదం తర్వాత విద్యార్థులు హాస్టల్ భవనంలోని రెండు, మూడవ అంతస్తుల నుండి బెడ్‌షీట్లు, తాళ్లను ఉపయోగించి వేలాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో చాలా మంది విద్యార్థులు గుడ్డ ముక్కను కట్టి కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
135 మృతదేహాల DNA గుర్తింపు
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాత్రి 10 గంటలకు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా, గవర్నర్, సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రకారం.. ఇప్పటివరకు 135 మృతదేహాల డీఎన్‌ఏ లభ్యమైంది. ఇప్పటివరకు 101 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
NIA, DGCA సహా భారతదేశం, విదేశాలకు చెందిన 8 ఏజెన్సీలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సోమవారం ముందుగా విమానం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఫ్లైట్ డేటా రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు.






