air india plane crash: విమాన ప్రమాదం.. మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న రమేష్ కొత్త వీడియో!

జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తప్ప అందరు ప్రయాణికులు మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదం నుండి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. అతను ఎయిర్ ఇండియా 171 విమానంలో ప్రయాణించాడు. 11A సీటులో కూర్చున్నాడు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం సమీపంలోని బి.జె. మెడికల్ కాలేజ్, సివిల్ హాస్పిటల్ హాస్టల్ మెస్‌లోకి దూసుకెళ్లింది.

విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. విమానం ఆసుపత్రి ఆవరణలోకి కూలిపోయింది. మెడికల్ కాలేజీ మృతులను కలుపుకుంటే మొత్తం 274కి చేరింది. తాజాగా ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘోర విమాన ప్రమాదం నుండి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ కొత్త వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో అతడు తీవ్రమైన అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం నుండి నడుచుకుంటూ ముందుకు వస్తున్నట్లు కనిపించాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణీకుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే.

బయటపడిన వీడియోలో ప్రమాదం తర్వాత అక్కడ తీవ్రమైన మంటలు చెలరేగుతున్నట్లు కనిపించాయి. ప్రజలు అరుస్తూ అందరినీ దూరంగా వెళ్లిపోవాలని సలహా ఇస్తున్నారు. ఇంతలో గాయపడిన వ్యక్తి మంటలు ఉన్న వైపు నుండి నడిచి వచ్చాడు. ఒక వ్యక్తి రమేష్‌ను చూసి అక్కడి నుండి త్వరగా పారిపోమని చెబుతాడు. కానీ రమేష్ అతనికి ఏదో చెబుతూ కనిపించాడు.

దీని తరువాత ఆ వ్యక్తి రమేష్ దగ్గరకు వెళ్లి అతని చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లాడు. ప్రమాదానికి గురైన విమానంలోనే తాను ఉన్నానని అక్కడ ఉన్న వ్యక్తులకు చెప్పాడు. దీని తరువాత విశ్వాస్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా చాలా మంది విశ్వాస్‌ను కలిశారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం