SPECIAL TRAINS: ఏపీ, తెలంగాణ మధ్య స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలివే

ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువ మంది ట్రైన్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల రద్దీ కూడా ఎక్కువే అయింది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీనీ దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. చర్లపల్లి – కాకినాడ – లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనుంది.

కాకినాడ – చర్లపల్లి

రైలు నెంబర్ 07447.. కాకినాడ టౌన్‌ – చర్లపల్లి మధ్య స్పెషల్ ట్రైన్ పరుగులు పెట్టబోతుంది. ఈ రైలు జూలై 5 నుంచి 2026 అంటే వచ్చే ఏడాది మార్చి 26 వరకు తిరుగుతుంది. ఈ ట్రైన్ ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో స్టార్ట్ అయి.. నెక్స్ట్ డే ఉదయం 8.30 గంటలకు చర్లపల్లికి వస్తుంది.

చర్లపల్లి – కాకినాడ టౌన్

రైలు నెంబర్ 07448.. చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య నడవనుంది.ఈ ట్రైన్ జూలై 6 నుంచి 2026 అంటే వచ్చే ఏడాది మార్చి 29 వరకు పరుగులుపెడుతుంది. ఈ ట్రైన్ ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌ కు వస్తుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్ సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగనున్నాయి. ఇందులో 1 AC, 2 AC, 3 AC, 3 AC ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ ఉండనున్నాయి.

కాకినాడ – లింగపల్లి

రైలు నెంబర్ 07445.. కాకినాడ టౌన్‌ – లింగంపల్లి మధ్య పరుగులు పెడుతుంది. ఈ ట్రైన్ జూలై 2 నుంచి 2026 అంటే వచ్చే ఏడాది మార్చి 30 వరకు ఉంటుంది. ఇది ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో నడుస్తుంది. రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో స్టార్ట్ అయి.. నెక్స్ట్ డే ఉదయం 8.50 గంటలకు లింగంపల్లికి వస్తుంది.

రైలు నెంబర్ 07446.. లింగంపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. జూలై 3 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇది ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉంటుంది. సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి.. నెక్ట్స్ డే ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌‌కి వస్తుంది.

ఈ ట్రైన్స్ సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్‌లలో ఆగనున్నాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం