deepika padukone : దీపిక పదుకొనేకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌గా గుర్తింపు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ నటి అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపికయ్యారు. తాజాగా ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్‌గా తెలియజేసింది. ఇందులో భాగంగా మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక పదుకొనేకు ఈ ఘనత లభించింది.

కాగా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ప్రతి ఏటా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ లిస్ట్ ను రిలీజ్ చేస్తూ ఉంటుంది.. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఈ గౌరవాన్ని దీపికా దక్కించుకుంది. దీంతో ఈ గౌరవం సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్‌గానూ దీపిక నిలిచారు.

ఈ లిస్ట్ లో దీపికాతో పాటు మరికొంతమంది నటులు కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్స్ డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ఆడమ్స్, టిమోతీ చలమెట్, స్టాన్లీ టుస్సీ వంటి వారితో మొత్తం 35 మంది ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఈ గౌరవం తనకు దక్కడంపై దీపిక పదుకొనే రియాక్ట్ అయ్యారు.

ఇంటర్నేషనల్ లెవెల్లో తనకు వచ్చిన ఈ గుర్తింపు తన వర్క్ గురించి మాత్రమే కాదని.. అందరికీ దాని అర్థం ఏంటో తెలియజేస్తుందని చెప్పింది. ఈ ఘనతపై పలువురు సినీ ప్రముఖులు దీపికాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దీపికా పదుకోనేకు ఇలాంటి గౌరవం రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా చాలా అవార్డులు అందుకున్నారు. ఆమె టైమ్ 100 ఇంపాక్స్ అవార్డు దక్కించుకున్నారు. అది మాత్రమే కాకుండా ఖతార్‌లో జరిగిన FIFA ఫైనల్స్‌లో వరల్డ్ కప్ ట్రోఫీని ప్రధానం చేసిన ఫస్ట్ ఇండియన్ నటిగా పేరు సంపాదించుకున్నారు.

 

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం