లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్, ముఖ్యంగా జో రూట్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రూట్ సెంచరీకి ఒక పరుగు దూరంలో 99 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు.
లార్డ్స్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న విశ్లేషణల నడుమ, భారత బౌలర్లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. నితీష్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే, ఓలీ పోప్, ఆ తర్వాత జో రూట్ నిలకడగా రాణించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు.
జస్పీత్ బుమ్రా కూడా హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే, జో రూట్ తన అనుభవాన్ని రంగరించి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ గాయంపాలవడంతో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు.
తొలి రోజు ఆటను పరిశీలిస్తే, ఇంగ్లండ్ తమ స్వభావానికి విరుద్ధంగా ఆచితూచి ఆడింది. భారత బౌలర్లు కట్టడి చేయగలిగినా, రూట్ పోరాట పటిమతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించింది. రెండో రోజు ఆటలో భారత బౌలర్లు త్వరగా మిగిలిన వికెట్లను తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలని చూస్తున్నారు.
జో రూట్ (191 బంతుల్లో 99 పరుగులు 9×4), స్టోక్స్ (39 పరుగులు) క్రీజులో ఉన్నాడు .పోప్ (44)తో రాణించాడు.






