Best Sleep Tips: మంచి నిద్రకు పర్ఫెక్ట్ చిట్కాలు.. పాటిస్తే అద్భుతమైన రిజల్ట్

మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది మంచి నిద్రకు కరువవుతున్నారు. సరైన నిద్ర లేక ఆరోగ్య సమస్యలబారిన పడుతున్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మంచి నిద్ర కోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే సమయానికి పడుకోవడం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడానికి, నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఇది శరీర గడియారాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.

నిద్రకు ముందు ప్రశాంతమైన వాతావరణం: నిద్రపోయే ముందు టీవీ చూడటం, ఫోన్ వాడటం వంటివి మానుకోండి. బదులుగా పుస్తకం చదవడం, గోరువెచ్చని స్నానం చేయడం, ధ్యానం చేయడం వంటివి చేయండి.

సౌకర్యవంతమైన పడకగది: పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండేలా చూసుకోండి. సౌకర్యవంతమైన mattress, దిండు ఎంచుకోండి.

కెఫిన్, ఆల్కహాల్ తగ్గించండి: సాయంత్రం వేళల్లో కెఫిన్ (టీ, కాఫీ), ఆల్కహాల్ తీసుకోవడం నిద్రకు భంగం కలిగిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం: రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ నిద్రవేళకు రెండు, మూడు గంటల ముందు వ్యాయామం చేయకుండా ఉండండి.

పగటిపూట నిద్ర తగ్గించండి: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం రాత్రి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. ఒకవేళ తప్పనిసరి అయితే.. 20-30 నిమిషాలకు మించకుండా చిన్న కునుకు తీయండి.

ఎక్కువ భోజనం మానుకోండి: రాత్రి పడుకునే ముందు ఎక్కువ భోజనం చేయడం మానుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడి నిద్రలేమికి ఒక ప్రధాన కారణం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లేదా శ్వాస వ్యాయామాలు చేయండి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీకు మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం