ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ (Dilip Vengsarkar) స్పందించారు. జైస్వాల్ అగ్రెసివ్ టెంపర్‌మెంట్‌ను తగ్గించుకుని, టెస్టు క్రికెట్‌కు అనుగుణంగా ఆడాలని సూచించారు.
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ (13, 0) నిరాశపరిచాడు. ముఖ్యంగా, రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అనవసరమైన పుల్ షాట్ ఆడి డకౌట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన దిలీప్ వెంగ్ సర్కార్, “జైస్వాల్ మంచి ఆటగాడు, అతనికి చాలా సామర్థ్యం ఉంది. కానీ కొన్నిసార్లు తన దూకుడును తగ్గించుకోవాలి. టెస్టు క్రికెట్‌లో, మీరు ప్రతి బంతిని దాని మెరిట్‌పై ఆడాలి. చిన్న పొరపాటు చేసినా అవుట్ అవుతారు” అని అన్నారు.
హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్, ఆ తర్వాత పరుగులు చేయడంలో తడబడుతున్నాడని వెంగ్ సర్కార్ గుర్తు చేశారు. “శతకం తర్వాత అతను పరుగులు చేయలేకపోయాడు, కానీ అత్యున్నత స్థాయిలో నిలకడ ముఖ్యం. టెస్టు క్రికెట్‌లో అతని నుంచి చాలా ఆశిస్తున్నాను” అని వెంగ్ సర్కార్ తెలిపారు.
లార్డ్స్ హానర్స్ బోర్డుపై మూడుసార్లు పేరు నమోదు చేసుకున్న ఏకైక విదేశీ బ్యాట్స్‌మెన్‌గా వెంగ్ సర్కార్ రికార్డు సృష్టించారు. అటువంటి అనుభవజ్ఞుడైన క్రికెటర్ నుండి వచ్చిన ఈ సలహా జైస్వాల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో ఉన్న నేపథ్యంలో, జైస్వాల్ తన ఆటను మెరుగుపరుచుకుని జట్టుకు మంచి ఆరంభాలను అందించడం కీలకం. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టులో జైస్వాల్ ఎలా రాణిస్తాడో చూడాలి.






