Immunity Boost Fruits : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు.. తిన్నారంటే బలమంతా మీదే!

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఈ కాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి, అందరూ తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వాతావరణం మారినప్పుడు వ్యాధుల బారిన పడేవారు, బిపి, అలెర్జీ వంటి వ్యాధితో బాధపడుతున్నవారు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి. ఎందుకంటే భారీ ఆహారం తినడం వల్ల అది త్వరగా జీర్ణం కాదు. అందువల్ల ఈ కాలంలో త్వరగా జీర్ణం అయ్యే పండ్లు, రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు

ఆపిల్

వర్షాకాలంలో ప్రతిరోజూ ఒక ఆపిల్ తినాలి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధులు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయి

బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.

లిచీ

వర్షాకాలంలో లభించే లిచీ పండు విటమిన్ సి.. విటమిన్ బి లకు కూడా మూలం. అలాగే, ఈ పండులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఈ సీజన్‌లో వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

పీచ్

పీచులో కెరోటిన్,, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో శరీరానికి అనేక ప్రయోజనాలను అందించే అద్భుతమైన పండు ఇది.

జామున్

జామూన్ తినడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. జామూన్‌లో పొటాషియం, విటమిన్లు ఉంటాయి. వర్షాకాలంలో దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

పియర్

విటమిన్ సి, కె అధికంగా ఉండే పియర్ పండు అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉండే ఈ పండును ఆయుర్వేదంలో అమృత పండుగా పరిగణిస్తారు.

ప్లం

ప్లం తినడం వల్ల శరీరంలోని ఐరన్ అవసరాన్ని తీరుస్తుంది. ఇందులో విటమిన్ సి లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ పండు తినాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం