వర్షాకాలంలో చాలా మందికి చుండ్రు సమస్యలు మొదలవుతాయి. చుండ్రు కారణంగా దురద కూడా వస్తుంది. అలాంటప్పుడు చుండ్రును వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చాలా మంది కెమికల్ ప్రొడెక్ట్‌లు వాడుతారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా ఈ ప్రొడెక్టెలు అధికంగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అయితే వర్షంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవి వాడటం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు బలంగా, మెరిసేలా మారుతుంది.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా తలపై స్క్రబ్ లాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను తలపై ఉన్న చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. జుట్టు కడుక్కోవడానికి షాంపూలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, ఆపై జుట్టును కడగాలి.
వెల్లుల్లి
వెల్లుల్లి చిట్కా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది చుండ్రును తొలగిస్తుంది. దీనిని ఉపయోగించడానికి 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని చూర్ణం చేసి నీటిలో కలపండి. ఈ నీటిని తలకు పట్టించి కొంత సమయం తర్వాత తల కడుక్కోండి. జుట్టు నుండి వెల్లుల్లి వాసనను తొలగించడానికి తేనె, అల్లం కూడా ఈ నీటిలో కలపవచ్చు.
పెరుగు
చుండ్రుకు పెరుగు ఒక నిరూపితమైన నివారణ. దీన్ని తలకు పట్టించడానికి పెద్దగా చేయనవసరం లేదు. జుట్టు కడుక్కునేటప్పుడు పెరుగు తీసుకుని తలకు రుద్దండి. తలకు బాగా పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడిగేయండి. ఈ నివారణను 3 నుంచి 4 రోజులు పాటిస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.
నిమ్మరసం
ఒక గిన్నె తీసుకుని నిమ్మరసం, కొబ్బరి నూనెను సమానంగా కలిపి తలకు పట్టించాలి. జుట్టు మొదులు నుంచి చివరల వరకు బాగా అప్లై చేయాలి. తర్వాత అరగంట నుండి ఒక గంట తర్వాత షాంపూతో తల కడుక్కోండి. చుండ్రు తగ్గడం స్పష్టంగా చూస్తారు.
వేప
వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చుండ్రును తొలగించడానికి వేప నూనెను ఏదైనా ఇతర నూనెతో కలిపి రాయాలి. వేప ఆకులను నీటిలో మరిగించి జుట్టును కడగాలి. లేదా వేపను పేస్ట్ లా చేసి తలపై అప్లై చేయాలి..






