పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ సగం ఆకలి తీర్చిందనే చెప్పాలి. ఇందులో పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్ రోల్ ఓ లెవెల్లో ఉంది. అతడు చెప్పే డైలాగ్స్, చేసే ఫైటింగ్స్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కో డైలాగ్ ఒక్కోక్కరిలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో పవన్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. ఈ మూవీని జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా నోచుకోలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అది కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.






