రేపు అంటే జూలై 18న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లోని మోతిహారిలో జరిగే ఒక బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈసారి 9.8 కోట్లకు పైగా రైతులకు రూ. 2,000 చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్ల పీఎం కిసాన్ పథకం కింద డబ్బుల స్టేటస్ ని ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్
ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inను సందర్శించాలి.
హోమ్‌పేజీలో “Farmers Corner” (రైతుల కార్నర్) అనే విభాగానికి వెళ్ళాలి.
అక్కడ “Know Your Status” లేదా “Beneficiary Status” (లబ్ధిదారుల స్థితి) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
అప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు స్టేటస్‌ను తనిఖీ చేయడానికి కొన్ని ఆప్షన్‌లు ఉంటాయి.
ఆధార్ నంబర్ (Aadhaar Number): మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
ఖాతా నంబర్ (Account Number): మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
మొబైల్ నంబర్ (Mobile Number): మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
ఆ తర్వాత పక్కన ఉన్న క్యాప్చా కోడ్‌ను (స్క్రీన్‌పై కనిపించే అక్షరాలు లేదా సంఖ్యలు) ఖాళీ పెట్టెలో టైప్ చేయండి.
ఆ తర్వాత “Get Data” లేదా “Get OTP” (మీరు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే) బటన్‌పై క్లిక్ చేయండి.
వివరాలు సరిపోలితే మీ పీఎం కిసాన్ స్టేటస్ మీకు కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వాయిదాల స్థితి వంటి సమాచారం ఉంటుంది. మీ e-KYC స్థితి, ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యిందా లేదా అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు.






