భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మరో అద్భుతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇది అతని కెరీర్‌లో ఏడవ టెస్ట్ సెంచరీ. దీంతో అతడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (6 సెంచరీలు), వృద్ధిమాన్ సాహా (3 సెంచరీలు)ల రికార్డులను బ్రేక్ చేశాడు.
Pant is taking On England bowlers #ENGvIND#Rishabpantpic.twitter.com/EjFyXYTz3v
— Stump Stories (@TheOG134773) June 21, 2025
రిషబ్ పంత్ తన ఇన్నింగ్స్‌లో ఇంకా చాలా రికార్డులు సృష్టించాడు. తన సెంచరీ పూర్తి చేసుకునే సమయంలో పంత్ 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. ఇంగ్లాండ్‌లో పంత్‌కు ఇది మూడవ టెస్ట్ సెంచరీ. విదేశీ గడ్డపై పంత్ 5 టెస్ట్ సెంచరీలు, స్వదేశంలో 2 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఇంగ్లీష్ గడ్డపై 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో పంత్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంత్ ఇన్నింగ్స్ సాంకేతికంగా బలంగా ఉండటమే కాకుండా.. ఇంగ్లీష్ బౌలర్లపై పంత్ దూకుడు శైలి భారత టెస్ట్ జట్టుకు మూలస్తంభమని మరోసారి నిరూపించుకున్నాడు.
ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24, హెడింగ్లీ (లీడ్స్)
2వ టెస్ట్: జూలై 2-6, ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్)
3వ టెస్ట్: జూలై 10-14, లార్డ్స్ (లండన్)
4వ టెస్ట్: జూలై 23-27, ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్)
5వ టెస్ట్: జూలై 31-ఆగస్టు 4, ది ఓవల్ (లండన్)






