IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. భారత జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం ఇచ్చింది. అయితే ఈ సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో చూడాలి? అని అనుకుంటున్నారా?. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ అధికారిక హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కొనుక్కుంది. కానీ సోనీ ఈ సిరీస్ OTT హక్కులను జియోస్టార్‌కు విక్రయించింది. అందువల్ల ఈ సిరీస్‌ను జియో హాట్ స్టార్ ద్వారా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలలో ఆస్వాదించవచ్చు. దీనిని ఫ్రీగానే చూడవచ్చు.
మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో
రెండో టెస్ట్ జులై 2 నుంచి 6 వరకు బర్మింగహామ్ లోని ఎడ్జ్ బాస్టన్‌లో
మూడో టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు లండన్ లోని లార్డ్స్‌లో
నాలుగో టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్‌లో
ఐదో టెస్ట్ జులై 31నుంచి ఆగస్టు 4 వరకు లండన్‌లోని కోన్నింగ్టన్ ఓవల్‌లో జరగనున్నాయి.
ఇక ఇంగ్లాండ్ టూర్ కోసం బీసీసీఐ ఇటీవల భారత టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్ మన్ గిల్ ను కెప్టెన్‌గా నియమించింది. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేసింది. రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం విశేషం.
టీమిండియా స్క్వాడ్
శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ స్క్వాడ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్, జాకబ్ బేతెల్, క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జెమీ స్మిత్, శామ్యూల్ జేమ్స్ కుక్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్, జాష్ టంగ్, జెమీ ఓవర్టన్.






