jagan mohan reddy: రోడ్డు ప్రమాదం కేసులో YS జగన్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటపల్లె గ్రామానికి వెళ్తుండగా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసులో జగన్ మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ పోలీసు అధికారి తెలిపారు.

కేసు ఏంటంటే?

ఏడాది క్రితం వైసీపీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ జూన్ 18న పల్నాడు జిల్లా రెంటపల్లె గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. ఆ జనాల మధ్య సింగయ్య అనే వృద్ధుడు జగన్ కారు టైర్ల కింద పడి చనిపోయినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. అనేక ఆధారాలను పరిశీలించిన తర్వాత, చనిపోయిన సింగయ్య అనే వృద్ధుడు జగన్ మోహన్ రెడ్డి కారు కింద కనిపించినట్లు తెలిసిందని అన్నారు. గాయపడి రక్తం పోగొట్టుకున్న ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారని సతీష్ కుమార్ వెల్లడించారు.

అందువల్ల మృతుడు సింగయ్య భార్య చీలి లూర్దు మేరీ ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారన్నారు. దీనితో పాటు 105, 49 లను కూడా చేర్చారు. cctv ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌తో పాటు అనేక ఆధారాలను పరిశీలించిన తర్వాత.. జగన్ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి ఆ వృద్ధుడు మరనించినట్లు పోలీసులు నిర్ధారించారని చెప్పారు.

నిందితుల్లో జగన్ మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డి, పర్సనల్ అసిస్టెంట్ కె. నాగేశ్వర్ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య, మాజీ మంత్రి విడదల రజని పేర్లు కూడా ఉన్నాయన్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం